బలవంతపు భూసేకరణ ఉండదు: మంత్రి బొత్స
ABN , First Publish Date - 2020-02-26T16:07:02+05:30 IST
బలవంతపు భూసేకరణ ఉండదు: మంత్రి బొత్స
అమరావతి: చంద్రబాబు ప్రజాచైతన్యయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే జగన్‌ను గెలిపించారన్నారు. వైసీపీ, సీఎం జగన్‌పై ఏపీ ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని పేర్కొన్నారు. పేద ప్రజల కోసమే ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నామని... బలవంతపు భూసేకరణ ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.