గత ప్రభుత్వం 6 లక్షల ఇళ్లు కట్టలేదు: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2020-11-01T02:48:58+05:30 IST

గత ప్రభుత్వం అసలు 6 లక్షల ఇళ్లు కట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేవలం 2 లక్షల ఇళ్లను మాత్రమే గత ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. వాటిలో 1.25 లక్షల ఇళ్లు సగం మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. సీపీఐ రామకృష్ణ

గత ప్రభుత్వం 6 లక్షల ఇళ్లు కట్టలేదు: మంత్రి బొత్స

విశాఖ: గత ప్రభుత్వం అసలు 6 లక్షల ఇళ్లు కట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేవలం 2 లక్షల ఇళ్లను మాత్రమే గత ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. వాటిలో 1.25 లక్షల ఇళ్లు సగం మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. సీపీఐ రామకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు.


ఇదిలా ఉంటే కావాలనే వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Read more