కార్యకర్తలిస్తే తప్పేంటీ?: బొత్స

ABN , First Publish Date - 2020-04-07T10:32:22+05:30 IST

తెల్లకార్డుదారులకు రూ.1000 సాయాన్ని ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలిస్తే తప్పేమిటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

కార్యకర్తలిస్తే తప్పేంటీ?: బొత్స

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): తెల్లకార్డుదారులకు రూ.1000 సాయాన్ని ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలిస్తే తప్పేమిటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చే సాయం అర్హులకు అందుతుందా? లేదా? అని చూడాల్సిన బాధ్యత తమపై ఉందని సమర్థించుకున్నారు. ఎమ్మెల్యేలు వీధుల్లోకి వెళ్లడాన్ని టీడీపీ రాజకీయం చేస్తూ గవర్నర్‌కు లేఖ రాయడమేమిటన్నారు. 

Read more