-
-
Home » Andhra Pradesh » Minister Balineni Srinivasareddy
-
రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు: బాలినేని
ABN , First Publish Date - 2020-12-30T22:13:12+05:30 IST
రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు

ప్రకాశం: రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘లోకేష్ ఒక పప్పు బాయ్. లోకేష్‌కి రైతుల గురించి ఏం తెలుసు. రైతులకు అన్ని రకాలుగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కొనుగోలు కాని పొగాకు ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన చరిత్ర సీఎం జగన్‌ది. గతంలో నా డబ్బులు ఐదు కోట్లు దొరికాయని ఆరోపించారు. లీగల్ నోటీసులు ఇస్తే సమాధానం కూడా లేదు. జూమ్‌లో పని పాట లేకుండా మాట్లాడుతున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు.