సుప్రీం కోర్టుకు వెళ్తాం!: బాలినేని

ABN , First Publish Date - 2020-05-30T07:32:21+05:30 IST

నిమ్మగడ్డ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సుప్రీం కోర్టుకు వెళ్తాం!: బాలినేని

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: నిమ్మగడ్డ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం శిరసావహిస్తుందని తెలిపారు. అయితే తీర్పులో లోటుపాట్లను పరిశీలించి నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని అనకాపల్లి ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ చెప్పారు.


న్యాయ వ్యవస్థపై తమకు అపార నమ్మకం ఉందని, అలా అని కోర్టులిచ్చే ప్రతి తీర్పు న్యాయంగా భావించలేమన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్‌ను మేనేజ్‌ చేయగలరని గతంలో జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యాఖ్యానించారన్నారు. తీర్పులపై కూడా ఆయన విభేదించారని, జస్టిస్‌ ఈశ్వరయ్యపై చర్యలు తీసుకుంటే తనపై కూడా చర్యలు తీసుకోవచ్చునన్నారు. ఇక, ‘ఎస్‌ఈసీగా నిమ్మగడ్డనే నియమించాలన్న హైకోర్టు తీర్పుపై సీఎం జగన్‌ తగిన నిర్ణయం తీసుకుంటారు. దానికోసం వేచి చూడండి’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-30T07:32:21+05:30 IST