అల్పపీడన పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2020-09-14T16:49:09+05:30 IST

జిల్లాలో అల్పపీడన పరిస్థితులపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా అధికారులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్‌లో ఆదేశించారు.

అల్పపీడన పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి బాలినేని

ప్రకాశం: జిల్లాలో అల్పపీడన పరిస్థితులపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా అధికారులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  ఫోన్‌లో ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులలో కోవిడ్ విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీటి కాలువల్లో పారుదల సాఫీగా ఉండే విధంగా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని.. విద్యుత్ అంతరాయాలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఒంగోలు శివారు కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆదేశించారు.


Updated Date - 2020-09-14T16:49:09+05:30 IST