హైకోర్టు తీర్పులపై మంత్రి బాలినేని తాజా వ్యాఖ్యలివీ..

ABN , First Publish Date - 2020-05-30T23:55:14+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద వర్గాల కోసం పని చేస్తుంటే కోర్టులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో...

హైకోర్టు తీర్పులపై మంత్రి బాలినేని తాజా వ్యాఖ్యలివీ..

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద వర్గాల కోసం పని చేస్తుంటే కోర్టులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో దేవుడికే తెలియాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


కోర్టుకెళ్తాం..!

కోర్టు తీర్పులు అటుంచితే ప్రజా క్షేత్రంలో మాత్రం ప్రజల తీర్పు జగన్ వైపే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ నియామక విషయంలో సుప్రీం కోర్టుకి వెళ్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు న్యాయంగా వస్తుందని భావిస్తున్నామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ కూడా చేయని విధంగా జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు.


శిరసా వహించాల్సిందే..

నిన్న నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉందన్నారు. హైకోర్టు తీర్పు ఏదైనా ప్రభుత్వం శిరసా వహించాల్సిందేనని కూడా చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై హైకోర్టు తీర్పు విషయంలో అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని పరోక్షంగా ఆయన సంకేతాలిచ్చారు. తీర్పులో లోటుపాట్లను పరిశీలించి ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-30T23:55:14+05:30 IST