టీడీపీ వాళ్లే రథాలను తగులబెట్టారు: బాలినేని

ABN , First Publish Date - 2020-09-17T20:47:45+05:30 IST

ప్రకాశం: సీఎం జగన్ సంక్షేమ పథకాలు చూసి భయపడి టీడీపీ నాయకులు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ వాళ్లే రథాలను తగులబెట్టారు: బాలినేని

ప్రకాశం: సీఎం జగన్ సంక్షేమ పథకాలు చూసి భయపడి టీడీపీ నాయకులు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వాళ్లే రథాలు తగులబెట్టి ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే సీఎం జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలితీసుకున్నాడన్నారు. చంద్రబాబుకి చరమగీతం పాడే రోజు ఆరోజే వచ్చిందన్నారు. 

Updated Date - 2020-09-17T20:47:45+05:30 IST