విశాఖే పరిపాలన రాజధాని అవుతుంది: అవంతి

ABN , First Publish Date - 2020-12-31T01:10:45+05:30 IST

దేశ చరిత్రలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి‌కే సాధ్యం అయ్యిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు

విశాఖే పరిపాలన రాజధాని అవుతుంది: అవంతి

విశాఖ: దేశ చరిత్రలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి‌కే సాధ్యం అయ్యిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది.. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. విశాఖ దక్షిణంలో టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్‌ల నిర్ణయం తీసుకుంటే మంచిది. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత కుమారుడు లోకేశ్‌ను రంగంలోకి దింపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆయనే సాటి’ అని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-31T01:10:45+05:30 IST