రూమర్స్ నమ్మవద్దు...ప్రజలను మేమే ఖాళీ చేయించాం: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2020-05-08T17:05:48+05:30 IST

రూమర్స్ నమ్మవద్దు...ప్రజలను మేమే ఖాళీ చేయించాం: మంత్రి అవంతి

రూమర్స్ నమ్మవద్దు...ప్రజలను మేమే ఖాళీ చేయించాం: మంత్రి అవంతి

విశాఖపట్నం: ప్రస్తుతం పాలిమర్స్ కంపెనీలో  స్టెర్లిన్  కెమికల్ బయటకు రాకుండా కొంతవరకు బృందం అదుపు చేసిందని.. ప్రస్తుతం ఇంకా పని చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఉదయం పాలిమర్స్‌లో తాజా పరిస్థితిపై ప్రత్యేక బృందం, ఫైర్ సిబ్బంది, ఫ్యాక్టరీ యాజమాన్యంతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం కొంత వ్యాపర్ బయటకు వస్తుందని.. దాన్ని ఈరోజు.. రేపటి లోగా పూర్తిగా అదుపు చేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలను భయబ్రాంతులకు గురి కావద్దని కోరుతున్నామన్నారు. బయట రూమర్స్ నమ్మవద్దని సూచించారు. గత రాత్రి కెమికల్ లీక్ అవుతుందని ఈ  చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను తామే ఖాళీ చేయించామని తెలిపారు. బయట ఉన్న ప్రజలకు ఆహారం అందించే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-08T17:05:48+05:30 IST