దమ్ముంటే నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2020-07-05T17:59:46+05:30 IST

దమ్ముంటే నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి: మంత్రి అవంతి

దమ్ముంటే నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి: మంత్రి అవంతి

విశాఖపట్నం: కొంతమంది రాజకీయ నిరుద్యోగులు...అమరావతి అంటే ప్రేమ ఉన్నట్టు, తమకు లేనట్టు మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అమరావతి బస్టాండ్ ఉందా?...రైల్వే స్టేషన్ నుండి ఎయిర్పోర్ట్ ఉందా అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి చేయాలంటే 30 సంవత్సరాలు పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి మీద తమ ప్రభుత్వానికి ఎలాంటి కక్షసాధింపు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు జూమ్ రాజకీయాలతో ఆర్గనైజ్ చేశారని విమర్శించారు. లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. అమరావతి కావాలో.. విశాఖ కావాలో...  దమ్ముంటే నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి  చూద్దాం అని మంత్రి అవంతి సవాల్ విసిరారు.


అమరావతిపై సబ్బంహరి, పురందేశ్వరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతి కోసం ముసలి కన్నీరు కాస్తున్నారని వ్యాఖ్యానించారు. సబ్బంహరికి రాజకీయ భిక్ష పెట్టింది విశాఖ ప్రజలు, రాజశేఖర్ రెడ్డి అని గుర్తుచేశారు. సబ్బం హరి  జగన్ మీద ద్వేషంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2022లో అధికారం దిగి పోతారంటూ చంద్రబాబు చెప్పారా?... కేంద్రం చెప్పిందా?..సబ్బం హరి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ మీద వివిధ వర్గాలు కలిసి సామూహిక దాడి చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు ముందు ఇచ్చిన హామీలు అమలు చేశారో.. లేదో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ  రైల్వే జోన్ హామీ నెరవేర్చలేదన్నారు. ఇసుక తీసుకుని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వీళ్లంతా కలిసి ఏమి కుట్ర ప్లాన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఆగే పరిస్థితి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-05T17:59:46+05:30 IST