టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదు: అవంతి

ABN , First Publish Date - 2020-05-24T19:35:20+05:30 IST

టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదు: అవంతి

టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదు: అవంతి

విశాఖపట్నం: టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలి నిర్ణయాలే ఫైనల్‌ అని ఆ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మంచిది, ఇప్పుడు చెడ్డదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొన్ని వ్యవస్థలను తన అధీనంలో ఉంచుకుని.. చంద్రబాబు అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. 

Updated Date - 2020-05-24T19:35:20+05:30 IST