-
-
Home » Andhra Pradesh » Minister Avanthi Sreenivas Daughter Nomination
-
మంత్రి అవంతి కుమార్తె నామినేషన్ వేయడంతో...
ABN , First Publish Date - 2020-03-13T20:41:30+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి.

విశాఖపట్నం : స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు నామినేషన్ వేస్తున్నారో.. ఎప్పుడు విత్ డ్రా చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. తాజాగా.. విశాఖ జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక నామినేషన్ దాఖలు చేశారు.
అయితే.. ఈ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధురవాడ జోనల్ కార్యాలయం దగ్గర టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ముందుగా వచ్చిన తమను కాకుండా మంత్రి అవంతి కుమార్తెను నామినేషన్ కోసం అనుమతించారని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గీయులను సర్ది చెప్పి..సజావుగా నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చూస్తున్నారు.