వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అవంతి.. సర్వత్రా విమర్శలు
ABN , First Publish Date - 2020-09-03T13:16:02+05:30 IST
బుధవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దీన్ని ప్రారంభించారు.

- అమాత్యా...ఇది మీకు తగునా?
- ఇరుకు సందులో అనుమతి లేకుండా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు
- సాక్షాత్తు మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించడంపై విమర్శలు
విశాఖపట్నం/అక్కయ్యపాలెం : అసలే ఇరుకు రోడ్డు...రాకపోకలకే నానా ఇబ్బందులు. అటువంటి చోట దిమ్మకట్టి విగ్రహం ఏర్పాటు చేయడం, అది కూడా ఎటువంటి అనుమతుల్లే కుండా పెట్టడం, సాక్షాత్తు మంత్రి దాన్ని ఆవిష్కరించడంపై స్థానికులు భగ్గమంటున్నారు. అభిమానానికి కూడా హద్దు ఉండాలని, విగ్రహం ఏర్పాటు తప్పుకాకున్నా ప్రజల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుని సౌకర్యవంతంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చుకదా? అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... జీవీఎంసీ 26వ వార్డు అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని మారుతి ఆశ్రమం ఉన్న వీధిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
బుధవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దీన్ని ప్రారంభించారు. ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, నియోజకవర్గం కన్వీనర్ కె.కె.రాజు తదితరులు కూడా హాజర య్యారు. అంతవరకు బాగానే ఉన్నా ఈ వీధి చిన్న సందులా ఉంటుంది. ఇరుకు వీధిలో రాకపోకలకు ఇప్పటికే స్థానికులు నానా అవస్థలు పడుతు న్నారు. అటువంటి వీధిలో ఓ చోట దిమ్మ నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేసి హడావుడిగా ప్రారంభిం చేశారు. ఈ కారణంగా రాకపోకలకు మరింత సమస్యలు ఏర్పడడంతో స్థానికులు విమర్శలు కురిపిస్తున్నారు.