తితలీ తుపాన్‌ పరిహారాన్ని మెక్కేసిన దొంగలు టీడీపీ నేతలు: అప్పలరాజు

ABN , First Publish Date - 2020-10-21T20:16:46+05:30 IST

శ్రీకాకుళం: తితలీ తుపాన్‌ పరిహారాన్ని అనర్హుల ఖాతాల్లో జమచేసి..

తితలీ తుపాన్‌ పరిహారాన్ని మెక్కేసిన దొంగలు టీడీపీ నేతలు: అప్పలరాజు

శ్రీకాకుళం: తితలీ తుపాన్‌ పరిహారాన్ని అనర్హుల ఖాతాల్లో జమచేసి.. మెక్కేసిన దొంగలు టీడీపీ నేతలు అంటూ మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్స్యకార భరోసాపై అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతల దగుల్బాజీ మాటలు వినే పరిస్థితిలో తాము లేమన్నారు. మూడు రాజధానుల విషయంలో సవాల్‌లు ఎందుకని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని రాజీనామా చేయమని చెప్పాలని ఆయన పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తే వైసీపీ పోటీకి దిగుతుందన్నారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. రాష్ట్రాన్ని సాధించుకున్నారని మంత్రి అప్పలరాజు గుర్తు చేశారు.

Updated Date - 2020-10-21T20:16:46+05:30 IST