తొలుత 41.15 మీటర్లలోనే నీటి నిల్వ

ABN , First Publish Date - 2020-12-03T08:36:08+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క మిల్లీ మీటరు కూడా తగ్గించేది లేదని జలవనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబరుకు

తొలుత 41.15 మీటర్లలోనే నీటి నిల్వ

 క్రమంగా 45.72 మీటర్లకు వెళతాం

2021 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం

అసెంబ్లీలో మంత్రి అనిల్‌ కుమార్‌ వెల్లడి


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క మిల్లీ మీటరు కూడా తగ్గించేది లేదని జలవనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబరుకు పూర్తిచేసి 2022 ఖరీఫ్‌ సీజన్‌లో నీళ్లిస్తామని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆయన పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలుత ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ చేస్తామన్నారు. క్రమంగా 45.72 మీటర్ల వరకు వెళ్తామని తెలిపారు. తండ్రి శంకుస్థాపన చేసిన రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని కొడుకు జగన్‌ ప్రారంభించడం దేవుడి కృపగా అనిల్‌ అభివర్ణించారు. ‘పీపీఏ ఐదుసార్లు సమావేశంపెట్టి అంచనా సవరణల వివరాలు కోరినా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు గడువు కోరుతూ వచ్చింది. 2014కి ముందు చేసిన వ్యయాలను మినహాయిస్తామని కేంద్రం చెబితే చంద్రబాబు ఎందుకు అంగీకరించారు’ అని ప్రశ్నించారు.

Updated Date - 2020-12-03T08:36:08+05:30 IST