ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి అనిల్
ABN , First Publish Date - 2020-07-20T02:58:52+05:30 IST
ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి అనిల్

నెల్లూరు: నెల్లూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని కోవిడ్ కేంద్రాన్ని మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందిస్తున్న భోజనాలు, సౌకర్యాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. మంత్రి అనిల్ కుమార్ ఆకస్మిక పర్యటనతో జీజీహెచ్ అధికారులు నీళ్లు నములుతున్నారు. ఈ మధ్య కాలంలో జీజీహెచ్ పై వస్తున్న ఆరోపణల రీత్యా మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.