తొలి ఏడాదిలోనే 90 శాతం పనులు పూర్తి చేశాం: మంత్రి అనిల్

ABN , First Publish Date - 2020-06-01T21:33:13+05:30 IST

కర్నూలు: శ్రీశైలం జలాశయం నుంచి బోటులో వెళ్లి వెలుగొండ ప్రాజెక్ట్ పనులను మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేష్ పరిశీలించారు.

తొలి ఏడాదిలోనే 90 శాతం పనులు పూర్తి చేశాం: మంత్రి అనిల్

కర్నూలు: శ్రీశైలం జలాశయం నుంచి బోటులో వెళ్లి వెలుగొండ ప్రాజెక్ట్ పనులను మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ కల్లా వెలుగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ టన్నల్ పనులు పూర్తి చేస్తామని మంత్రి అనిల్ తెలిపారు. ఈ సంవత్సరంలో ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీరందిస్తామన్నారు. గత 5 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ కేవలం 4 కిలో మీటర్లే తవ్వారన్నారు.


తమ ప్రభుత్వంలో 4 నెలలో 3 కిలోమీటర్ల టన్నెల్ తోవ్వేశామని మంత్రి అనిల్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డి పల్లి రిజర్వాయర్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో మొదటి సంవత్సరం 90 శాతం హామీలు పూర్తి చేయడం జరిగిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వెలుగొండ ప్రాజెక్ట్‌లోని ఒక టన్నెల్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా 60 కోట్లరూపాయలు ఆదా చేశామన్నారు.


Updated Date - 2020-06-01T21:33:13+05:30 IST