పవన్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపాటు
ABN , First Publish Date - 2020-12-29T21:43:22+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా జనసేనానిపై మండిపడ్డారు
ప్రకాశం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా జనసేనానిపై మండిపడ్డారు. ‘రాజకీయం అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ కాదు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయి.. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు..మా నాయకుడిలా పాదయాత్ర చేయండి. 14 నెలలు పాదయాత్ర చేయాలంటే సినిమా కాదు. ఏ పార్టీకి సపోర్టు చేస్తాడో ఆయనకే తెలియదు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక పోయారు’ అంటూ సురేష్ ఎద్దేవా చేశారు.