మార్కెట్‌లోకి సంగం సుగంధద్రవ్యాల పాలు

ABN , First Publish Date - 2020-09-12T09:48:16+05:30 IST

రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన పాల ఉత్పత్తులను శుక్రవారం సంగం డెయిరీ మార్కెట్‌లోకి

మార్కెట్‌లోకి సంగం సుగంధద్రవ్యాల పాలు

చేబ్రోలు, సెప్టెంబరు 11: రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన పాల ఉత్పత్తులను శుక్రవారం సంగం డెయిరీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీలో పసుపు, మిరియాలు, అల్లం, దాల్చినచెక్క రుచులతో సుగంధ భరిత పాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. 200 మీల్లీలీటర్లు సామర్ధ్యంతో 90 రోజుల పాటు నిల్వ కాల పరిమితితో వాడుకునే విధంగా ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు నరేంద్ర కుమార్‌ వివరించారు.


Updated Date - 2020-09-12T09:48:16+05:30 IST