తెల్లారికాడికి వత్తాలే!!

ABN , First Publish Date - 2020-05-17T10:18:44+05:30 IST

‘ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. తెల్లారకాడికి వత్తాలే.. నా పోన్లో బాలెన్స్‌ అయిపోనాది.. ఈలైతే రీచార్జెయ్‌’ అంటూ ఊళ్లో ఉన్న భార్యకు ఫోన్‌చేశాడు!..

తెల్లారికాడికి  వత్తాలే!!

భార్యకు వలస కూలీ ఆఖరి ఫోన్‌

తోటి కూలీలతో కలిసి సొంతూరికి పయనం

లారీ కోసం నిరీక్షిస్తుండగా  పోయిన ప్రాణం

చంద్రగిరిలో సిక్కోలు వలసకూలీ విషాదాంతం


చంద్రగిరి/తిరుపతి, మే 16(ఆంధ్రజ్యోతి) : ‘ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. తెల్లారకాడికి వత్తాలే.. నా పోన్లో బాలెన్స్‌ అయిపోనాది.. ఈలైతే రీచార్జెయ్‌’ అంటూ ఊళ్లో ఉన్న భార్యకు ఫోన్‌చేశాడు!.. మూణ్నెల్ల ఎడబా టు దుఃఖం తీరబోతోందనే సంతోషమో, భయానక మృత్యుకాలపు భయమో.. రోడ్డు పక్కన కల్వర్టుమీద నడుం వాల్చిన ఆ సిక్కోలు వలసకూలీ మరి లేవలే దు. తెల్లారేసరికి ఆ బడుగుజీవి..తం తెల్లారిపోయిం ది. శనివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర జాతీయరహదారిపై వెలుగుచూసిన విషాదమిది. చంద్రగి రి మండలం నాగయ్యగారి పల్లె వద్ద పైపుల ఫ్యాక్టరీ లో పనిచేసేందుకు ఇచ్చాపురం నుంచి పదిమంది కా ర్మికులు 3 నెలల కిందట వచ్చారు. లాక్‌డౌన్‌తో పనిలేక.. మరోవైపు ప్రజారవాణా లేకపోవడంతో ఊరెళ్లలేక రోజులు లెక్కపెట్టుకుంటూ కాలం గడిపారు. ఊ ళ్లోని భార్యాబిడ్డలపై బెంగతో.. ఎలాగోలా పల్లెకు చేరుకోవాలని శుక్రవారం నడిచి బయలుదేరారు. నాయుడుపేట దాకా చేరుకుంటే ఏ లారీయో పట్టుకుని వెళ్లిపోవచ్చని ఆశపడ్డారు. చంద్రగిరి క్రాస్‌రోడ్డులోని పె ట్రోల్‌ బంకు దగ్గరకి రాత్రి ఏడింటికి చేరుకున్నారు. అప్పుడే మోహన్‌రావు అనే కూలీ భార్యకు ఫోన్‌ చే శాడు. ఏదోలా తెల్లారేసరికి వచ్చేస్తా అని చెప్పాడు. తర్వాత అందరూ ఆ చీకట్లో రోడ్డు పక్కన రాత్రంతా ఉన్నారు.


నడిచే ఓపికలేదు. ఏదైనా వాహనం వస్తే ఆపి ఎక్కవచ్చని ఎదురు చూస్తూ గడిపారు. శనివా రం 11 గంటల ప్రాంతంలో ఒక లారీ ఆగింది. ఎక్కండెక్కండంటూ హడావుడి పడ్డారు. కల్వర్టు మీద న డుం వాల్చిన మోహనరావు ఎంతకీ లేవకపోవడంతో తట్టి లేపారు. కదల్లేదు మెదల్లేదు. పడుకున్నవాడు పడుకున్నట్టే ఊపిరొదిలేశాడు. మోహన్‌రావుకు భా ర్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తిరుపతిలోని ఎస్వీ కాలేజీలో పోస్ట్‌మార్టం చేసి మృతదేహాన్ని అప్పగించారు. బతికుండగా మా ఊరికి చేర్చలేకపోయారు కనీసం శవాన్నయినా పల్లెకు పంపండ య్యా’ అని సహచర కార్మికులు కన్నీళ్లతో వేడుకున్నా రు. శనివారం సాయంత్రం వాహనం ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-05-17T10:18:44+05:30 IST