వలస కార్మికుల వసతికి 294 కేంద్రాలు
ABN , First Publish Date - 2020-04-05T08:37:39+05:30 IST
కరోనా నియంత్రణ చర్యల్లో భా గంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 294 వసతి కేంద్రాలను నెలకొల్పినట్లు రాష్ట్ర సమన్వయకర్త, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శనివారం తెలిపారు. ఈ కేంద్రాల్లో 17,475

అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ చర్యల్లో భా గంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 294 వసతి కేంద్రాలను నెలకొల్పినట్లు రాష్ట్ర సమన్వయకర్త, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శనివారం తెలిపారు. ఈ కేంద్రాల్లో 17,475 మంది నిరాశ్రయులు, వలసకార్మికులకు వసతితోపాటు ఆహారం, వైద్యసదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్‌జీఓలు మరో 36 కేంద్రాలు ఏర్పాటుచేసి 4,142 మందికి వసతి కల్పిస్తున్నాయని వివరించారు. కంపెనీలు 19,207 మందికి తక్షణ వసతి కల్పించి ఆహారం అందిస్తున్నాయని చెప్పారు.