వలస కూలీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: డీజీపీ
ABN , First Publish Date - 2020-05-18T02:54:57+05:30 IST
వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు పంపించడం కోసం ముఖ్యమంత్రి జగన్ అన్ని రకాల ప్రయాత్నాలు చేస్తున్నారని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. విజయవాడ నుంచి మణిపూర్

విజయవాడ: వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు పంపించడం కోసం ముఖ్యమంత్రి జగన్ అన్ని రకాల ప్రయాత్నాలు చేస్తున్నారని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. విజయవాడ నుంచి మణిపూర్ వెళుతున్న శ్రామిక్ రైలును రాయనపాడులో డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నార్త్ ఈస్ట్ స్పెషల్ మొట్టమొదటి రైలును ప్రారంభించామని చెప్పారు. ఏపీ నుంచి మొత్తంగా 31 శ్రామిక్ రైళ్లు వెళ్తున్నాయని, వీటిలో 11 రైళ్లు విజయవాడ నుంచే బయలుదేరుతున్నాయని డీజీపీ తెలిపారు. నడుచుకొని వెళ్తున్న వలస కూలీల కోసం సీఎం జగన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. కాలినడకన వెళ్లే వలస కూలీలకు భోజన వసతితో పాటు రెస్ట్ తీసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఏపీలో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు మరో 22 రైళ్లకు అనుమతులు రావాల్సిందని డీజీప తెలిపారు.