పటమటలో వలస కార్మికులపై ఖాకీల దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-05-17T20:43:01+05:30 IST

స్వస్థలాలకు తరలించాలంటూ పటమటలో నిరసన చేపట్టిన వలస కార్మికులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వలస కార్మికులపై లాఠీచార్జ్ చేశారు. కార్మికుల గదుల్లోకి వెళ్లి మరీ దాడికి

పటమటలో వలస కార్మికులపై ఖాకీల దౌర్జన్యం

విజయవాడ: స్వస్థలాలకు తరలించాలంటూ పటమటలో నిరసన చేపట్టిన వలస కార్మికులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వలస కార్మికులపై లాఠీచార్జ్ చేశారు. కార్మికుల గదుల్లోకి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డారు. కాగా, పోలీసుల లాఠీచార్జిని అదునుగా తీసుకుని వలస కార్మికులపై స్థానికులు సైతం దాడికి పాల్పడ్డారు. స్థానికుల దాడిలో ఓ వలస కార్మికుడి తలకు గాయమైంది. దీంతో కార్మికులంతా రోడ్డుపై బైఠాయించారు.

Updated Date - 2020-05-17T20:43:01+05:30 IST