కార్మికులపై లాఠీ చార్జ్ దారుణం: మధు

ABN , First Publish Date - 2020-05-17T21:06:37+05:30 IST

పటమటలో బెంగాల్‌కు చెందిన వలస కార్మికులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని సీపీఎం నేతలు మధు, సిహెచ్ బాబూరావు తీవ్రంగా ఖండించారు. లాఠీ చార్జ్‌కు నిరసగా వలస

కార్మికులపై లాఠీ చార్జ్ దారుణం: మధు

విజయవాడ: పటమటలో బెంగాల్‌కు చెందిన వలస కార్మికులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని సీపీఎం నేతలు మధు, సిహెచ్ బాబూరావు తీవ్రంగా ఖండించారు. లాఠీ చార్జ్‌కు నిరసగా వలస కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మధు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదనే రైలు రద్దైందని కార్మికులకు వివరించారు. వలస కార్మికులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్మికులను రెండు మూడు రోజుల్లో తమ తమ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని కార్మికులకు తెలిపారు. కార్మికులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


వలస కార్మికులపై పోలీసుల లాఠీచార్జ్ అమానుషం అని మరో నేత బాబూరావు అన్నారు. ఇళ్లల్లో ఉన్న వారిపై కూడా దాడి చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేదన్నారు. స్వస్థలాలకు పంపమంటే పోలీసులతో కొట్టిస్తారా? అని ధ్వజమెత్తారు. పనులు లేక పస్తులు ఉంటున్న వారికి కనీసం భోజనం కూడా పెట్టరా? అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైళ్లను ఏర్పాటు చేసి, వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించాలని బాబూరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-17T21:06:37+05:30 IST