విజయవాడలో వలస కార్మికులపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-05-17T20:28:47+05:30 IST

స్వస్థలాలకు తరలించాలంటూ పటమటలో వలస కార్మికుల ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైటాయించిన బెంగాలీ వలస కార్మికులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

విజయవాడలో వలస కార్మికులపై పోలీసుల దాడి

విజయవాడ: స్వస్థలాలకు తరలించాలంటూ పటమటలో వలస కార్మికుల ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైటాయించిన బెంగాలీ వలస కార్మికులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వలస కార్మికుల రూమ్స్‌లోకి కూడా వెళ్లి లాఠీలతో కార్మికులను పోలీసులు చితకొట్టారు. పోలీసుల లాఠీచార్జీని అదునుగా తీసుకుని వలస కార్మికులపై స్థానికుల కూడా దాడి చేశారు. స్థానికుల దాడిలో వలస కార్మికుడి తలకు గాయమైంది. పోలీసులు లాఠీఛార్జికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి వలస కార్మికులు నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు సి.హెచ్. బాబూరావు మద్దతు తెలిపారు.


శనివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి జాతీయ రహదారిపై అమాయకులైన ఉత్తరాది వలస కూలీలపై పోలీసులు విరుచుకుపడ్డాయి. చేతిలో సైకిళ్లతో ఉన్న ఆ బడుగు జీవుల వీపులపై విన్యాసం చేశాయి. మమ్మల్ని విడిచిపెట్టండి.. మా ఊరెళ్లిపోతాం.. అంటూ ఒకటే హాహాకారాలు.. అయినా.. పోలీసుల దాష్టీకం ఆగలేదు. ఈ ఘటన సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో చోటుచేసుకోవడం గమనార్హం. 

Updated Date - 2020-05-17T20:28:47+05:30 IST