బస్సు ప్రమాదం... వలస కార్మికుని మృతి
ABN , First Publish Date - 2020-05-17T20:08:18+05:30 IST
చెన్నై నుంచి కోల్‌కత్తాకు వలసవాసులతో వెళుతున్న ఓ బస్సుకు జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వెటర్నరీ కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ : చెన్నై నుంచి కోల్‌కత్తాకు వలసవాసులతో వెళుతున్న ఓ బస్సుకు జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వెటర్నరీ కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. కళాశాల వద్ద ఓ లారీని వెనుకవైపు నుంచి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.