ద్వారకాతిరుమలలో వలస కూలీల ఆందోళన

ABN , First Publish Date - 2020-05-14T01:41:59+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

ద్వారకాతిరుమలలో వలస కూలీల ఆందోళన

పశ్చిమగోదావరి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా  ఏపీ సర్కారు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో వలస కూలీలు చిక్కుకుపోయారు. తమ సొంత గ్రామాలకు పంపించాలంటూ ద్వారకాతిరుమలలో వలస కూలీలు ఆందోళన చేపట్టారు. గత 18 రోజులుగా బాలయోగి గురుకుల పాఠశాలలో 106 మంది వలస కూలీల బస చేశారు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వలస కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, వారి అనుమతితో వలస కూలీలను స్వగ్రామాలకు పంపుతామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2020-05-14T01:41:59+05:30 IST