అర్ధరాత్రి గిరిజన విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-08T16:29:23+05:30 IST

గిరిజన విద్యార్థులు నిద్రహారాలు మాని అర్థరాత్రి వరకు ఆందోళన చేశారు.

అర్ధరాత్రి గిరిజన విద్యార్థుల ఆందోళన

విజయనగరం జిల్లా: గిరిజన విద్యార్థులు నిద్రహారాలు మాని అర్థరాత్రి వరకు ఆందోళన చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్య పరిష్కరించడంలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా, కొమరాడ మండలానికి చెందిన 250 మంది గిరిజన విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తామున్న గిరిజన ప్రాంతానికి సంబంధించి.. గిరిజన ప్రాంతంగా ధృవీకరణ పత్రం ఇవ్వాలని పట్టుపట్టారు. తాము ఎన్ని రోజులుగా వేడుకుంటున్నా రెవెన్యూ అధికారులు తమ గోడు వినిపించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు నిద్రహారాలు మానేసి రాత్రంతా తహసీల్దార్ కార్యాలయం గుమ్మం ముందు ఆందోళన చేశారు.

Updated Date - 2020-07-08T16:29:23+05:30 IST