కొత్త సంవత్సరానికి మైక్రో ఆర్టిస్టులు ఇలా స్వాగతం పలికారు!
ABN , First Publish Date - 2020-12-31T21:29:35+05:30 IST
కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పలువురు మైక్రో ఆర్టిస్టులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వివిధ ఆకృతులను మలిచి అబ్బుర పరిచే ఈ సూక్ష్మ కళాకారులు...
ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పలువురు మైక్రో ఆర్టిస్టులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వివిధ ఆకృతులను మలిచి అబ్బుర పరిచే ఈ సూక్ష్మ కళాకారులు... 2021ని తమదైన శైలిలో స్వాగతిస్తూ.. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విశాఖకు చెందిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ విజేత డాక్టర్ గట్టెం వెంకటేశ్ నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. నాలుగు పెన్సిళ్లను ఉపయోగించి.. 2021ను చెక్కారు. ఒక్కోదానిపై ఒక్కో అంకెను చెక్కారాయన. దీని కోసం రెండు గంటల పాటు కష్టపడ్డానని ఆయన తెలిపారు.
ఇక కర్నూల్‌లోని మంత్రాలయానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ నళిని మనసాని.. 2021ని చెయిన్ లింక్ మాదిరి రూపొందించారు. 17ఎంఎం. పొడవుతో 4ఎంఎం వెడల్పుతో రూపొందించిన ఈ చెయిన్ లింక్ ఆమె ప్రతిభకు అద్దం పడుతోంది.
