-
-
Home » Andhra Pradesh » Member of the APCC Coordinating Committee Sunkara Padma Shri
-
ఏడాది కాలానికి అమ్మ పలికింది: సుంకర పద్మశ్రీ
ABN , First Publish Date - 2020-06-23T09:54:11+05:30 IST
ఏడాది కాలానికి అమ్మ పలికింది: సుంకర పద్మశ్రీ

అమరాతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘‘పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలానికి అమ్మ పలికింది. మహిళలకు అన్యాయం జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉండీ పట్టించుకోలేని పరిస్థితిల్లో ఉన్నందుకు వాసిరెడ్డి పద్మ సిగ్గు పడాలి. జగన్‌రెడ్డి ఇచ్చే చిల్లరకు కక్కుర్తిపడి కేవలం ప్రతిపక్షాలపైనే కేసులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు’’ అని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వ్యాఖ్యానించారు. సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.