నీలం సాహ్ని పదవీ విరమణ సందర్భంగా మేకపాటి గౌతమ్ శుభాకాంక్షలు..
ABN , First Publish Date - 2020-12-31T14:39:22+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని నేడు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆమెకు మంత్రి మేకపాటి గౌతమ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని నేడు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆమెకు మంత్రి మేకపాటి గౌతమ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పని విషయంలో ఆమె పాటించే విలువలు.. వృత్తి నైపుణ్యం ప్రభుత్వానికి వరంగా మారాయని ఆయన కొనియాడారు. ‘‘చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని మేడమ్ నేడు రిటైర్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. పని విషయంలో మీరు పాటించే విలువలు.. వృత్తి పట్ల నైపుణ్యం.. మన ప్రజల కోరికలను నెరవేర్చడానికి మా ప్రభుత్వానికి వరంలా మారింది. మీ భవిష్యత్ అద్భుతంగా కొనసాగాలని ఆశిస్తున్నాం’’ అంటూ మేకపాటి గౌతమ్ ట్వీట్ చేశారు.