త్వరలో విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్: గౌతమ్ రెడ్డి

ABN , First Publish Date - 2020-12-17T23:12:01+05:30 IST

త్వరలోనే విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు

త్వరలో విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్: గౌతమ్ రెడ్డి

అమరావతి: త్వరలోనే విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మాణం. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. కరోనా అనంతరం చైనా నుంచి వైదొలగి ఏపీలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీ. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీలో ప్రత్యేకంగా జపాన్ డెస్కు ఏర్పాటు. శ్రీసిటీ సెజ్ లో ఇప్పటికే ఓ జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏపీ అభివృద్ధిలో భాగమైంది. జపాన్ పరిశ్రమల నుంచి  పెట్టుబడులు ఆకర్షణ కోసం జపాన్-ఇండియా తయారీ సంస్థ (జిమ్ ) ఏర్పాటు’ చేసినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-17T23:12:01+05:30 IST