ఏపీ ఆర్థిక పురోగతిపై వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి

ABN , First Publish Date - 2020-07-27T23:34:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతి సాధన కోసం టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగు రోజుల వర్చువల్ సమావేశాల్లో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర

ఏపీ ఆర్థిక పురోగతిపై వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతి సాధన కోసం టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగు రోజుల వర్చువల్ సమావేశాల్లో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యదర్శుల ఆధ్వర్యంలో ‘మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ పాజిటివ్’ థీమ్‌తో సమాలోచనలు జరిపారు. ఈ కార్యక్రమానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ పీఐ హరనాథ్, రాష్ట్రీయ ఇస్పట్ నిగం లిమిటెడ్ చైర్మన్ ప్రదోశ్ కుమార్ రత్, ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, ఆంధ్రప్రదేశ్ సీఐఐ చైర్మన్ డి. రామకృష్ణ, శ్రీనివాస ఫామ్స్, ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఎండీ సురేష్ చిట్టూరి తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2020-07-27T23:34:48+05:30 IST