అది వాస్తవమే!

ABN , First Publish Date - 2020-04-05T09:02:10+05:30 IST

విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి కొన్ని పరిశ్రమలు తరలివెళ్లిపోయిన మాట వాస్తవమేనని పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పరోక్షంగా అంగీకరించారు. దీని వెనుక స్వార్థపూరిత శక్తులు

అది వాస్తవమే!

  • మెడ్‌టెక్‌ నుంచి పరిశ్రమలు వెళ్లిపోవడంపై పూనం
  • నేటి నుంచి కరోనా పరీక్షల కిట్లు తయారీ


విజయవాడ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి కొన్ని పరిశ్రమలు తరలివెళ్లిపోయిన మాట వాస్తవమేనని పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పరోక్షంగా అంగీకరించారు. దీని వెనుక స్వార్థపూరిత శక్తులు ఉన్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎంటీజడ్‌లో వెంటిలేటర్లు, కరోనా పరీక్షల కిట్ల తయారీని వివరించేందుకు శనివారం విజయవాడలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్‌ఎల్‌ఎల్‌ ద్వారా వెంటిలేటర్లు, కరోనా పరీక్షల కిట్ల కోసం ఆర్డర్లు ఇస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వెంటిలేటర్లు, కరోనా పరీక్షల కిట్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. దీంతో ఈ రెండింటినీ తయారు చేసే అవకాశం ఎంటీజడ్‌కు వచ్చిందని ఆమె వివరించారు. ఎంటీజడ్‌లో ఆదివారం నుంచే కరోనా పరీక్షల కిట్లు తయారీ పనులు ప్రారంభమవుతాయని, పదో తేదీ నుంచి వెంటిలేటర్లు, కిట్లు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు. ఇతర దేశాల నుంచీ వెంటిలేటర్ల కోసం ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ఎంటీజడ్‌ను కేంద్రం ప్రశంసించిందని, దీనిని నేషనల్‌ ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీగా తయారు చేయాలని సీఎంకు లేఖ కూడా రాసిందన్నారు.

Updated Date - 2020-04-05T09:02:10+05:30 IST