క్వారంటైన్ సెంటరులో వైద్య సిబ్బందికి అస్వస్థత

ABN , First Publish Date - 2020-04-21T19:16:06+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 82 ఎకరాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటరులో వైద్య సిబ్బంది అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది.

క్వారంటైన్ సెంటరులో వైద్య సిబ్బందికి అస్వస్థత

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 82 ఎకరాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటరులో వైద్య సిబ్బంది అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. రక్త నమూనాలు సేకరించడానికి వెళ్లిన డా. కళ్యాణ చక్రవర్తి , లాబ్ టెక్నీషన్ హరి అస్వస్తతకు గురయ్యారు. 


డీహైడ్రేషన్‌కు గురై డాక్టర్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్ హరి కళ్లు తిరిగి పడిపోయారు. వసతుల కొరత వలనే అనారోగ్యం పాలయ్యారని సహ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రథమ చికిత్స అందించి ఇద్దరినీ ఇంటికి తరలించారు.


Updated Date - 2020-04-21T19:16:06+05:30 IST