వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థికసాయం

ABN , First Publish Date - 2020-11-19T09:16:46+05:30 IST

వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థికసాయం

వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థికసాయం

కేంద్రానికి ఎంపీ విజయసాయిరెడ్డి వినతి 


న్యూఢిల్లీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌కు లేఖ రాశారు. 13 వైద్య కళాశాలల ఏర్పాటుకు సుమారు రూ.13,500కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. అదేవిధంగా.. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సహకరించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞ ప్తి చేశారు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురితో బుధవారం ఆయన భేటీ అయ్యారు.  

Updated Date - 2020-11-19T09:16:46+05:30 IST