ప్రైవేటు ఆస్పత్రులు పనిచేసేలా చర్యలు: గౌబ

ABN , First Publish Date - 2020-05-11T10:44:46+05:30 IST

దేశ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు

ప్రైవేటు ఆస్పత్రులు పనిచేసేలా చర్యలు: గౌబ

అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ చర్యలపై ఆదివారం వివిధ రాష్ట్రాల సీఎస్‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్‌ ్స నిర్వహించారు. ఈ సందర్భంగా గౌబ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు చేర్చే ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలన్నారు. వలస కార్మికులు ఎవరైనా రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులపై నడిచి వెళ్తుంటే అడ్డుకుని.. పునరావాస కేంద్రాలకు తరలించాలని.. ఆ తర్వాత ప్రత్యేక రైళ్లలో వారిని స్వరాష్ట్రాలకు చేర్చాలని ఆదేశించారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని విమానాలు, ఓడల ద్వారా తీసుకొచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. గ్రీన్‌ , ఆరెంజ్‌ జోన్లలో పరిశ్రమలు పునఃప్రారంభమవుతున్నందున్న ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు తీసుకునేలా చూడాలని సీఎ్‌సలను ఆదేశించారు.

Updated Date - 2020-05-11T10:44:46+05:30 IST