త్వరలో ఇసుక పాలసీ: మంత్రి పేర్ని నాని

ABN , First Publish Date - 2020-09-01T09:18:29+05:30 IST

రాష్ట్రంలో త్వరలో ఇసుక పాలసీ మారనుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నిర్మాణాల ప్రగతిపై సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో

త్వరలో ఇసుక పాలసీ:  మంత్రి పేర్ని నాని

ఏలూరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో ఇసుక పాలసీ మారనుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నిర్మాణాల ప్రగతిపై సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో ఇసుకు పాలసీ మారుస్తామని, నవంబరు, డిసెంబరుకల్లా ప్రకటన చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వమే ఇంటింటికీ ఇసుకను సరఫరా చేస్తోందని, దీనిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో కొత్తపాలసీని రూపొందిస్తున్నామని వివరించారు. టీడీపీ హయాంలో జరిగిన పనులు నాణ్యత ఉంటేనే బిల్లులు చెల్లిస్తామన్నారు. ఇసుక సమస్య, పెండింగ్‌ బిల్లుల కారణంగా కాంట్రాక్టర్లు తప్పుకోవడం, అధ్వానంగా తయారైన రహదారుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తారు. సమావేశంలో మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, కలెక్టర్‌ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-01T09:18:29+05:30 IST