మరో వివాదంలో సంచయిత గజపతి రాజు

ABN , First Publish Date - 2020-12-15T17:49:22+05:30 IST

మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పద మవుతున్నాయి. తాజాగా మరో వివాదానికి ఆమె తెరతీశారు. నగరంలోని అయోధ్య మైదానానికి

మరో వివాదంలో సంచయిత గజపతి రాజు

విజయనగరం: మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పద మవుతున్నాయి. తాజాగా మరో వివాదానికి ఆమె తెరతీశారు. నగరంలోని అయోధ్య మైదానానికి తాళాలు వేయడం వివాదానికి దారితీసింది. విద్యార్థులు, సిబ్బంది తప్ప మిగిలిన వారు లోపలికి వెళ్లకూడదని మహరాజా కాలేజీ ప్రిన్సిపాల్ నోటీసులు ఇచ్చారు. ఈ నిర్ణయంపై స్థానికులు మండి పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాలేజీ మైదానంలో నగర ప్రజలు వాకింగ్ చేస్తుండగా... తాజాగా తాళాలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాన్సాస్ యాజమాన్యం తీరుపై నగర ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2020-12-15T17:49:22+05:30 IST