-
-
Home » Andhra Pradesh » mansas trust lands ycp govt
-
మాన్సాస్ భూముల దోపిడీకి జగన్ కుట్ర: మాధవ్
ABN , First Publish Date - 2020-03-13T16:28:11+05:30 IST
న్సాస్ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మాన్సాస్ భూములను దోచుకోవడానికి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

విజయనగరం: మాన్సాస్ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మాన్సాస్ భూములను దోచుకోవడానికి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యా సంస్థలు, ఆలయాల నిర్వహణకు పీవీజీ రాజు రూ. లక్షల కోట్ల విలువ చేసే భూములు దానం చేశారని అన్నారు. ఆ భూములను కాజేయాలనే దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే అక్రమ జీవోలు జారీ చేసిందని ఆరోపించారు. మాన్సాస్ బోర్డులో సుప్రీంకోర్టు న్యాయవాదిని చేర్చడంతోనే జగన్ ఆంతర్యం ఏమిటో అర్థమైపోయిందని మాధవ్ పేర్కొన్నారు.