మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: జగన్

ABN , First Publish Date - 2020-08-01T22:46:49+05:30 IST

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. మాణిక్యాలరావు మృతిపట్ల

మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: జగన్

అమరావతి: మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని జగన్ చెప్పారు. మాణిక్యాలరావు అంత్యక్రియలపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.


మాణిక్యాలరావు మృతదేహాన్ని నేరుగా తాడేపల్లిగూడెంకు బీజేపీ నేతలు తరలించారు. తాడేపల్లిగూడెంలోనే అంత్యక్రియలుకు కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. పార్ధివదేహాన్ని మహా ప్రస్థానం వాహనంలో ఎక్కించిన అనంతరం నేతలు  నివాళులు అర్పించారు.

Updated Date - 2020-08-01T22:46:49+05:30 IST