మాంగనీస్ వ్యర్థాలు పడి ఇద్దరు మహిళల దుర్మరణం
ABN , First Publish Date - 2020-12-20T08:58:11+05:30 IST
విజయనగరం జిల్లాలో మాంగనీసు వ్యర్థాలు మీదపడి శనివారం ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఎస్‌ఐ నారాయణరావు కథనం మేరకు గరివిడి మండలం తోండ్రంగి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి(53), సూరీడమ్మ(53)

చీపురుపల్లి (గరివిడి) డిసెంబరు 19: విజయనగరం జిల్లాలో మాంగనీసు వ్యర్థాలు మీదపడి శనివారం ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఎస్‌ఐ నారాయణరావు కథనం మేరకు గరివిడి మండలం తోండ్రంగి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి(53), సూరీడమ్మ(53) శనివారం ఉదయం దువ్వాం సమీపంలో మట్టి దిబ్బల వద్ద మాంగనీసు రద్దును వెలికి తీస్తున్నారు. అకస్మాత్తుగా పైనుంచి మట్టి పెళ్లలు విరిగి వీరిపై పడ్డాయి. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి, ఎక్సకవేటర్ సహాయంతో మట్టిని తొలగించగా మృతదేహాలు బయటపడ్డాయి.