-
-
Home » Andhra Pradesh » mangalagiri shivalayam temple eo suspend
-
మంగళగిరి శివాలయం ఈవో సస్పెండ్
ABN , First Publish Date - 2020-05-13T22:09:06+05:30 IST
మంగళగిరి శివాలయం ఈవో జేవీ నారాయణను అధికారులు సస్పెండ్ చేశారు. లాక్‌డౌన్ వేళ నిబంధనలకు విరుద్ధంగా శివాలయంలో భక్తులను పూజలకు అనుమతించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

గుంటూరు: మంగళగిరి శివాలయం ఈవో జేవీ నారాయణను అధికారులు సస్పెండ్ చేశారు. లాక్‌డౌన్ వేళ నిబంధనలకు విరుద్ధంగా శివాలయంలో భక్తులను పూజలకు అనుమతించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఈవో జేవీ నారాయణను సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జేవీ నారాయణ స్థానంలో నృసింహాలయ ఈవోగా ఉన్న సానకాల రావును శివాలయం ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమించారు.