క్వారంటైన్ సెంటర్ల తొలగింపు అనాలోచిత చర్య: బుద్ధ ప్రసాద్

ABN , First Publish Date - 2020-07-27T22:17:54+05:30 IST

కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని

క్వారంటైన్ సెంటర్ల తొలగింపు అనాలోచిత చర్య: బుద్ధ ప్రసాద్

అమరావతి: కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఉధృతమవుతున్న వేళ క్వారంటైన్ సెంటర్లు తీసివేయటం అనాలోచిత చర్య అని ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలపై వివక్ష పెరుగుతున్నందున వెంటనే క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేకపోతే అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఏర్పాటు చేస్తామని, అందుకోసం ప్రభుత్వం అనుమతివ్వాలని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెల్లడించకపోవడం దారుణం అన్నారు. పరీక్షలు నిర్వహించిన 15 రోజులకు కూడా పాజిటీవ్, నెగిటీవ్ అనే విషయం వెల్లడించకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని బుద్ద ప్రసాద్ ప్రశ్నించారు. కరోనా మృతదేహాలను ఎవరూ తీసుకెళ్లడం లేదని, వాలంటీర్లను ప్రోత్సహించి వారికి తగిన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలకు వాలంటీర్లు, పోలీసులు అంతిమ సంస్కారాలు నిర్వహించటం అభినందనీయమని బుద్దప్రసాద్ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-27T22:17:54+05:30 IST