స్నేహితుడిని రైలు కిందకు తోసేశాడు!

ABN , First Publish Date - 2020-02-08T13:44:32+05:30 IST

మద్యం మత్తులో స్నేహితుడినే రైలు కిందకు తోసేసే ప్రయత్నం చేసాడో ఘనుడు. పీలేరు రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన సునీల్‌(22), నరేశ్‌(20) స్నేహితులు.

స్నేహితుడిని రైలు కిందకు తోసేశాడు!

పీలేరు టౌన్‌, ఫిబ్రవరి 7: మద్యం మత్తులో స్నేహితుడినే రైలు కిందకు తోసేసే ప్రయత్నం చేసాడో ఘనుడు. పీలేరు రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన సునీల్‌(22), నరేశ్‌(20) స్నేహితులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి పీలేరు వారపు సంత ప్రాంగణంలో మద్యం సేవించారు. మద్యం సేవించేటప్పుడు మాటామాటా పెరిగి ఇద్దరూ కొట్టుకున్నారు. అక్కడి నుంచి ఇళ్లకు వెళదామని బయలుదేరారు. సంత ప్రాంగణం నుంచి రాజీవ్‌ నగర్‌ కాలనీ వెళ్లే మార్గంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు వచ్చేటప్పటికి తిరుపతి నుంచి గుంతకల్‌ వెళ్లే రైలు వస్తోంది. దీంతో వారిద్దరూ ఆగారు. ఇంతలో ఉన్నట్టుండి మద్యం మత్తులో ఉన్న సునీల్‌ ఒక్కసారిగా నరేశ్‌ రైలు కిందకు తోసేసి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. దీంతో రైలు బోగి తగిలి నరేశ్‌ ఎడమ చేయి విరిగిపోయింది. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన అతనిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతనికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2020-02-08T13:44:32+05:30 IST