దీక్షలు విజయవంతం చేయండి: నాదెండ్ల
ABN , First Publish Date - 2020-12-07T09:21:05+05:30 IST
‘‘నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలి. ఈ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన దీక్షలను విజయవంతం చేయాలి’

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలి. ఈ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన దీక్షలను విజయవంతం చేయాలి’’ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గ, మండల స్థాయిలో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలపాలని.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు దీక్షను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.