299వ రోజు మహా పాదయాత్ర

ABN , First Publish Date - 2020-10-12T09:49:35+05:30 IST

‘చేయి చేయి కలుపుదాం.. అమరావతిని సాధించుకుందాం’ అనే నినాదం రాజధాని ప్రాంతంలో

299వ రోజు మహా పాదయాత్ర

గుంటూరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ‘చేయి చేయి కలుపుదాం.. అమరావతిని సాధించుకుందాం’ అనే నినాదం రాజధాని ప్రాంతంలో మార్మోగింది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 299వ రోజుకు చేరుకున్నాయి. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు నుంచి దాదాపు 10వేల మంది రైతులు, యువకులు, మహిళలు మందడం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. ఉదయం 9గంటలకు తుళ్లూరుకు చేరుకొన్న 29గ్రామాల రైతులు, మహిళలు, జేఏసీ, దళిత జేఏసీ నేతలు మహా పాదయాత్రను ప్రారంభించారు. మందడం వరకు 12కి.మీ. మేర నడిచారు. అనంతరం అక్కడినుంచి ఎవరి గ్రామాలకు వారు వెళ్లి శిబిరాల్లో ఆందోళనలు కొనసాగించారు. 

Updated Date - 2020-10-12T09:49:35+05:30 IST