-
-
Home » Andhra Pradesh » Madhu comments on modi
-
కేంద్రం తీరుకు నిరసనగా రైతులు రోడ్డెక్కారు: మధు
ABN , First Publish Date - 2020-11-21T18:20:35+05:30 IST
విజయవాడ: ప్రధాని మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ.. ప్రజలను గాలికి వదిలేస్తున్నారని సీపీఎం నేత మధు తెలిపారు.

విజయవాడ: ప్రధాని మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ.. ప్రజలను గాలికి వదిలేస్తున్నారని సీపీఎం నేత మధు తెలిపారు. కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా రైతులు, కార్మికులు రోడ్డెక్కారన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారని మధు తెలిపారు.