ఏపీలో కరోనా వైద్యం అస్తవ్యస్తంగా ఉంది: మధు

ABN , First Publish Date - 2020-07-27T16:28:49+05:30 IST

విజయవాడ: కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వామ పక్షాలు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ..

ఏపీలో కరోనా వైద్యం అస్తవ్యస్తంగా ఉంది: మధు

విజయవాడ: కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వామ పక్షాలు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా విజృంభణ వల్ల ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఆరు వందల మంది రోగులు ఉంటే... మూడు వందల బెడ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. 


ఏపీలో కరోనా వైద్యం అస్తవ్యస్తంగా ఉందన్నారు. సీపీఎం నేత రఘు కరోనాతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే వైద్యం అందలేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఇప్పుడు వైద్యం చేయిస్తున్నామన్నారు. మరో నాయకుడు కృష్ణయ్య పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందన్నారు. ఆయనకు మూడు రోజులలో ఒక్క మందు బిళ్ల కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం చేసే ప్రకటనలకు... ఆచరణకు పొంతన లేదని మధు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. లేదంటే బందరు రోడ్డు పై బైటాయించి పోరాటం చేస్తామని మధు తెలిపారు.

Updated Date - 2020-07-27T16:28:49+05:30 IST